పశువుల పాకలు తొలగించొద్దని పాడి రైతుల ఆందోళన
అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో చేకూరివారి తోట నుండి ఆవపుంత,కట్టుగొప్ప ప్రాంతంలోని పొలాలమీద రోడ్డు ప్రక్కనున్న పాడిరైతుల పశువుల పాకలు తొలగించొద్దని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో పాడిరైతులు ఆందోళన చేశారు.
ఈసందర్భంగా ఏపి కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ గ్రామంలోని పొలాల మీద పంచాయతీ రోడ్డు ప్రక్కనున్న పశువుల పాకలు తొలగిస్తారని ప్రచారం జరగడంతో పాడిరైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇక్కడ గ్రామంలోని ఎటువంటి ఆధారం లేని కొంతమంది పాడి రైతులు పశువులను మేపుకుంటూ వాటిపై వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోసించు కుంటున్నారన్నారు. పశువుల పాకలు గ్రామానికి దాదాపు కిలో మీటర్ దూరంలో వున్నాయని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. కావున గ్రామ పంచాయతీ అధికారులు ఈ ప్రచారానికి తెర దించుతూ పాడి రైతులు ఆందోళన చెందకుండా మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ బలవంతంగా పశువుల పాకలు తొలగిస్తే ఆందోళన చెపడతామని ఆయన తెలిపారు.
ఈకార్యక్రమంలో పాడి రైతులు టి.విష్ణు మూర్తి, పి.స్వామి, ఎస్. సత్యనారాయణ, జి.సత్యనారాయణ, జి.సూరిబాబు, డి.సూరి,ఎ.రాంబాబు, పి.దేవయ్యవీ.ఆంజనేయులు, పి.దానయ్య,కె.ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.