logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అంబేద్కర్ జయంతి సందర్భంగా వార్డ్ No 08,కురన్నపేట యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ముఖ్య అతిథిగా నిర్మల్ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అర్జుమంద్ అలీ.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని, ఈరోజు 8వ వార్డు కురన్నపేట్ సామాజిక కార్యకర్త నిగులపు సంజీవ్ మరియు స్థానిక కౌన్సిలర్ షేక్ సల్మాన్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమాంద్ ఆలీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
​సయ్యద్ అర్జుమాంద్ ఆలీ గారి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజం కోసం అంబేద్కర్ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన జయంతి రోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రక్తదానం చేయడం ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడవచ్చని, యువత సేవా దృక్పథంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రక్తదాతలకు,వార్డు ప్రజలకు మరియు హాజరైన పెద్దలకు కౌన్సిలర్ షేక్ సల్మాన్ మరియు నిగులపు సంజీవ్, నాజిమ్ ఖాన్,గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

2
5 views

Comment