అరైవ్ అలైవ్” (Arrive Alive) రహదారి భద్రత కార్యక్రమాన్ని ఒక కార్యక్రమంగా కాకుండా ఒక ఉద్యమంగా స్వీకరించాలని తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి పిలుపు
కామారెడ్డి ప్రతినిధి
తేది :14.04.2026
కామారెడ్డి జిల్లా
మంగళవారం
“అరైవ్ అలైవ్” (Arrive Alive) రహదారి భద్రత కార్యక్రమాన్ని ఒక కార్యక్రమంగా కాకుండా ఒక ఉద్యమంగా స్వీకరించాలని తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కళాభారతిలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిధిగా, IG చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ASP చైతన్య రెడ్డి, adl sp నరసింహ రెడ్డి, బాన్స్వాడ dsp విఠల్, గ్రంధాలయ చైర్మన్ చంద్ర కాంత్, rdo nv గిరి, మున్సిపల్ ఛైర్పర్సన్
ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో డిజిపి శివధర్ రెడ్డి ముఖ్యమైన అంశాల పై అవగాహన కల్పించారు.
రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. బైక్‌పై ప్రయాణించే సమయంలో ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అంతేకాకుండా 4–5 సంవత్సరాల చిన్నారులకు కూడా హెల్మెట్ పెట్టడం చాలా ముఖ్యం అని సూచించారు.
వాహనం నడిపేటప్పుడు డ్రైవర్ మాత్రమే కాకుండా పక్కన కూర్చున్న వారు కూడా సీట్ బెల్ట్ ధరించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఇది ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
డిఫెన్స్ డ్రైవింగ్ (Defensive Driving) గురించి అవగాహన కల్పిస్తూ, ముందుచూపుతో, జాగ్రత్తగా వాహనం నడపడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
“అరైవ్ అలైవ్” అనే సందేశాన్ని ఉద్దేశిస్తూ, ఇంటి నుండి బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు.
రోడ్డు ప్రమాదాలు తీవ్రమైన సమస్యగా మారుతున్న ఈ నేపథ్యంలో, అందరి సహకారంతో అవగాహన పెంచి అనేక ప్రాణాలను కాపాడగలమని డిజిపి తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తే ఇంటి నుండి బయటకు వెళ్లిన వారు సేఫ్ గా ఇల్లు చేరుకుంటారని, ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
“ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం – సమాజంలో ప్రమాదాలను అరికడదాం” అనే సందేశంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అంతకు ముందు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు, జీవితాలు ఛిద్రమవుతున్న తీరును నాటిక రూపంలో,
రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘన వంటి కారణాల వల్ల జరుగుతున్న ప్రమాదాల పై ప్రత్యేక నాటక రూపం లో ప్రదర్శించిన తీరు చూపారులను ఆకట్టుకున్నాయి.
జిల్లాలో చోటుచేసుకున్న యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన స్క్రిప్ట్‌లు, నాటక ప్రదర్శనలు కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచాయి.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టామని చెప్పారు.
సెల్ ఫోన్ అనేది అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాల్సినదని, వాహనం నడిపేటప్పుడు దాన్ని ఉపయోగించడం ప్రమాదాలకు దారితీస్తుందని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా సుమారు 300 మందికి హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ట్రక్కులు, లారీలు నడిపే డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, 161 మందికి ఉచితంగా కళ్లజోడ్లు అందజేయడం జరిగిందని,
జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ చర్యల ఫలితంగా 2025 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ అందిస్తున్న నిధుల ద్వారా ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్బంగా వంకాయల రవి 50 మందిని రక్షించిన సందర్బంగా డీజీపీ చేతుల మీదుగా సన్మానించారు.
ఈ కార్యక్రమం లో పోలీస్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.