ఆళ్లగడ్డ టౌన్ సీఐ యుగంధర్‌కు జర్నలిస్టుల ఘన వీడ్కోలు.
AIMA న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా విధులు నిర్వహించి, బదిలీపై వెళ్తున్న యుగంధర్ ను ఆళ్లగడ్డ వర్కింగ్ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఆయనకు శాలువా కప్పి, పూలమాలలతో గౌరవించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా ఏపీ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రసాద్ రాయల్ మాట్లాడుతూ ఆళ్లగడ్డలో సీఐ యుగంధర్ పనిచేసిన కాలం ఎంతో ప్రశాంతంగా సాగిందని. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన చూపిన చొరవ, ప్రజల సమస్యల పట్ల స్పందించిన తీరు అభినందనీయమని.విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటూనే, అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని వారు గుర్తు చేసుకున్నారు.సత్కారం అందుకున్న అనంతరం సీఐ యుగంధర్ మాట్లాడుతూ. ఆళ్లగడ్డలో తన పదవీ కాలం సంతృప్తిని ఇచ్చిందని పోలీసు శాఖకు, ప్రజలకు మధ్య వారధిలా నిలుస్తూ మీడియా ప్రతినిధులు అందించిన సహకారం మరువలేనిదని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమాజ హితం కోసం జర్నలిస్టులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రసాద్ రాయల్, జర్నలిస్టులు అక్షింతల శ్రీనివాసులు, కేఎల్ మోహన్ రెడ్డి, అరుణ్ (99 టీవీ), విల్సన్ (AM న్యూస్), రాజ్ కుమార్ (ప్రైమ్ 9 టీవీ) తదితరులు పాల్గొన్నారు.