డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు
కామారెడ్డి ప్రతినిధి
తేది :14.04.2026
కామారెడ్డి జిల్లా
మంగళవారం
జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడిగా చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆయన చూపించిన మార్గం సమానత్వం, విద్య, స్వాభిమానం అనే విలువలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
అంతేకాకుండా, విద్య ద్వారా మాత్రమే సామాజిక, ఆర్థిక పురోగతి సాధ్యమని, యువత అంబేద్కర్ బాటలో నడిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ B. R. Ambedkar రూపొందించిన రాజ్యాంగ ఆర్టికల్స్ (Articles) పై జిల్లా కలెక్టర్ సమగ్రంగా వివరిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఆర్టికల్ దేశ ప్రజల హక్కులు, బాధ్యతలు, సామాజిక న్యాయం సమానత్వాన్ని పరిరక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక హక్కులు, దిశానిర్దేశక సూత్రాలు (Directive Principles), పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన ఆర్టికల్స్ గురించి సవివరంగా చర్చించారు.
అలాగే, డాక్టర్ అంబేద్కర్ దూరదృష్టి వల్లే భారతదేశం ఒక ప్రజాస్వామ్య, సమానత్వం ఆధారిత దేశంగా ఎదిగిందని కొనియాడారు. అనంతరం ఆయన చూపిన మార్గంలో నడవాలని, రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టాలని అందరికీ పిలుపునిచ్చారు.
*అనంతరం కైలాస్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.*
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ NV గిరి, తహసీల్దార్ హిమబిందు, మున్సిపల్ ఛైర్పర్శన్ ఉమారాణి, వివిధ శాఖల అధికారులు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.