క్లియర్ వ్యూ లాసిక్ నేత్ర చికిత్సా కేంద్రం ప్రారంభించిన మంత్రి ఫరూక్.
నంద్యాల (AIMA MEDIA ):
నంద్యాల జిల్లా పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు లో ఉన్న మాతృత్వ ఫెర్టిలిటీ సెంటర్ పై అంతస్తులో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ విజయ భాస్కర రెడ్డి ఏర్పాటు చేసిన క్లియర్ వ్యూ లాసిక్ సెంటర్ ను సోమవారం రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. కేంద్రంలోని వివిధ విభాగాలను ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయభాస్కర రెడ్డి మాట్లాడుత కంటి అద్దాల అవసరం లేకుండా కంటిలో చేసే చికిత్స కోసం అత్యాధునిక లేజర్ లాసిక్ సెంటర్ ను నంద్యాలలో ఏర్పాటు చేశామని, నంద్యాలలో ఉన్న నేత్ర వైద్యులు అందరూ ఈ కేంద్రంలో కంటి అద్దాలు అవసరంలేని చికిత్సలు చేసుకోవచ్చని అన్నారు. రాయలసీమలో ఇది అత్యాధునిక రెండవ కేంద్రమని, రాష్ట్రం ఈ స్థాయి కేంద్రాలు నాలుగు మాత్రమే ఉన్నాయి అని తెలిపారు. ఈ అవకాశాన్ని నంద్యాల, కర్నూలు జిల్లాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో కంటి అద్దాలు అవసరం లేని చికిత్స కోసం కోట్లాది రూపాయల విలువ చేసే పరికరాలతో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేటు రంగంలో వైద్య కళాశాల ఆసుపత్రులు ప్రైవేటు ఆసుపత్రులలో నిష్ణాతులైన వివిధ రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు ప్రజలకు సేవలు అందిస్తున్నారని, నంద్యాల వైద్య కేంద్రంగా మారిందని అన్నారు. నంద్యాల వైద్యులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ఆదర్శప్రాయంగా నిలిచారని అభినందించారు.