logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆటోలో మర్చిపోయిన బంగారు ఆభరణాలను 24 గంటల్లో మార్కాపురం పోలీసులు గుర్తించి బాధితురాలికి అప్పగించారు.

మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల నిమిత్తం బొమ్మనబోయిన జ్యోతి అనే మహిళ పుట్టింటికి వచ్చింది. తిరిగి స్వగ్రామం హనుమంతునిపాడు మండలం మల్లవరం వెళ్లే సందర్భంలో బస్టాండుకు ఆటోలో వెళుతూ చీరలతో పాటు రెండున్నర లక్షలు చేసే బంగారాన్ని మరిచిపోయింది. వెంటనే జ్యోతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో గంటల వ్యవధిలో ఆటోను గుర్తించారు. ఆటోలో ఉన్న సొత్తును సీఐ సుబ్బారావు బాధిత మహిళలకు చీరలతో పాటు బంగారాన్ని కూడా అప్పగించారు

107
3324 views

Comment