logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు మాట్లాడుతూ :-

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం ఆనందకరం అన్నారు. అంబేద్కర్ గారు దేశానికి రాజ్యాంగాన్ని అందించి సామాజిక న్యాయానికి పునాది వేశారు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. దక్షిణ రాష్ట్రాలకు గతంలో అన్యాయం జరిగిందని అన్నారు.

గత ప్రభుత్వ కాలంలో ఎస్సీ వర్గాలకు సరైన రుణాలు అందలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే దళిత బంధు వంటి పథకాలను తీసుకువచ్చారని అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం పేద, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తోందని, సామాజిక న్యాయం సాధనకు కృషి చేస్తోందని తెలిపారు.

0
0 views

Comment