logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చతిస్గడ్ ఎన్కౌంటర్లో నేలకొరిగిన మావోయిస్టు నేత భాగ్య (రూపి )

ఎన్కౌంటర్ లో నేలకొరిగిన ధర్మారం వాసి
చనిపోయే వరకు సిద్ధాంతాన్ని వదలని భాగ్య
ధర్మారంలో విషాధ ఛాయలు
సచ్చినా, బతికినా ప్రజల కోసమే నమ్మిన మావో సిద్ధాంతాన్ని వదలబోనని ప్రతిన బూనిన సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్ లో నేలకొరిగింది పోలీసుల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ఏరియా కమాండర్ రూపి అలియాస్ భాగ్య మృత్యువాత పడింది మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన భాగ్య ఆలియాస్ (రూపీ )2004 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరింది అప్పటినుండి భాగ్య మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఏరియా కమాండర్ వరకు ఎదిగింది. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చ్ 31 లోపు లొంగిపోవాలని పిలుపునిచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు మావోయిస్టులు మాత్రం లొంగిపోవడానికి నిరాకరించారు అందులో భాగ్య ఉండడం విశేషం 2004 ఏడాదిలో దుబ్బాక దళానికి పరిచయమైన భాగ్య గత కొంత కాలంగా ఇందుప్రియాల్, నర్సాపూర్ దళాల్లో పనిచేసింది ఇక్కడ తీవ్ర నిర్బంధం ఏర్పడడంతో దండకారణ్యానికి వెళ్ళింది అక్కడి నుండి అభుజ్ మాడ్ లో పని చేసింది ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో పార్థాపూర్ ఏరియా కమాండర్ గా పనిచేస్తోంది చోటే బేటియా అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఆమె మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. చనిపోయే వరకు ఇంటిముఖం చూడని భాగ్య మరణం ధర్మారం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి నిరుపేద కుటుంబానికి చెందిన భాగ్య కుటుంబ సభ్యులు చివరి చూపుకైనా మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చే విధంగా చూడాలని వేడుకుంటున్నారు తమ బిడ్డ చనిపోయిందని తల్లితోపాటు కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి సుమారు 24 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్న భాగ్య ప్రాణాలతో ఇంటికి తిరిగి వస్తుందని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు, చనిపోయిందని తెలియడంతో గుండెలు బాదుకుంటూ కూతురి ఆఖరి చూపు కోసం రోదిస్తూ ఎదురుచూస్తున్నారు కనీసం తినడానికి తిండి కూడా లేని కుటుంబం నుండి మావోయిస్టు పార్టీలో చేరిన భాగ్య పోలీసుల కాల్పులు చనిపోవడం బాధాకరమని, కనీసం కుటుంబ సభ్యుల కోరిక మేరకు భాగ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.

47
2081 views

Comment