logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మర్రి నరేష్ ప్రధాన వార్త : మోరపెల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.. మహనీయుని అడుగుజాడల్లో నడవాలని పిలుపు...




జగిత్యాల జిల్లా : మోరపెల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను గ్రామస్తులు, దళిత సంఘాల నాయకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఫ్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఉప్పసర్పంచ్ గంగరాజాం, మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, అంబేద్కర్ అలానే యూత్ నాయకులు మాట్లాడుతూ.. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని ఆయన నమ్మారని, నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ వేడుకల్లో ఉపసర్పంచ్ గంగారాం, అంబేద్కర్ సంఘం పెద్దమనుషులు బొల్లె లక్ష్మణ్, కసవత్తుల గంగాధర్, బొల్లె బన్నీ, మల్లేష్ పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు విజయ్, తిరుపతి, శరత్ రెడ్డి, సునీత, లింగన్న తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
కార్యక్రమంలో యువ నాయకులు కరుణాకర్, రామ్ మోహన్, అమరేందర్, రమేష్, చిరంజీవి, వేణు, మహేష్‌లతో పాటు అంబేద్కర్ సంఘ సభ్యులు విష్ణు, లక్ష్మణ్, వంశీ, కార్తీక్, సిద్దు, రాహుల్, సాయి, చెందు, సృజన్, గంగారాం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేశారు.

2
645 views

Comment