జార్జిరెడ్డి వర్ధంతిఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే వీరేశం
జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు వారి చిత్రపటానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, జార్జిరెడ్డి గారి త్యాగం, సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.