దేశ వ్యాప్తంగా రోడ్డెక్కిన సహార భాధితులు
ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి.
-కోట్ల రూపాయల సహార భారీ స్కాంపై నోరు మెదపని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు.
-సహార బాధితులకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ.
-సహార ఇండియా సంస్థ దోచుకున్న సొమ్మును తిరిగి సహార భాధితులకు చెల్లించాలి.- టి ఆర్ పి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సంబేటి సుమన్.
-ఆత్మహత్యలకు పాల్పడుతున్న సహారా బాధితులు.
డబ్బులు రాకుంటే చావే శరణ్యమన్న సహారా బాధితులు...
నిజామాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు సంబందించిన సహార భాధితులు, సహార ఏజెంట్లు సహారా ఇండియా సంస్థలో జమ చేసిన మొత్తం డబ్బులను ఇప్పించవలసిందిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు భాధిత కుటుంబాలు ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడంజరిగింది. సహార భాధితులను ఉద్దేశించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సంబేటి సుమన్ మాట్లాడుతూ...
ఎన్నో సంవత్సరాలుగా రూపాయి రూపాయి కూడా బెట్టి సహార ఇండియా సంస్థలో జమచేస్తే అటు ఏజెంట్లను ఇటు సహార ఇండియా ఖాతాదారులను సహార ఇండియా సంస్థ నిండా ముంచిందని అన్నారు. దొరల సొమ్ము దొంగల పాలైనట్లు, పేదల సొమ్ము సహార ఇండియా సంస్థ అధిక లాభాల పేరుతో దోచుకుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి దొంగ సంస్థలకు అనుమతులు ఇచ్చి పేదల గొంతుకోయ్యద్దని అన్నారు. సహార ఇండియా సంస్థ ఖాతా దారులు జమ చేసిన ఒక్కో రూపాయి పిల్లల చదువులకోసం, పెళ్లిళ్ల కోసం, గృహ నిర్మాణాల కోసం, చిన్న చితక వ్యాపారాల కోసం, కుటుంబం ఆర్థికంగా ఎదగడాని కోసం చెమటోడ్చి సంపాదించిన సొమ్మును సహార ఇండియా సంస్థలో జమచేస్తే పేదల సొమ్మును పేదలకు చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఖాతా దారులు సహార ఇండియా ఏజెంట్లు ఉరివేసుకునే దుస్థితి తీసుకువచ్చింది అన్నారు. ఆడబిడ్డ డెలివరీ కోసం అందుతాయని ఆశతో ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు సమయానికి డబ్బులు అందక పుట్టబోయే బిడ్డ పురిటిలోనే చచ్చే స్థితికి వచ్చిందని అన్నారు. పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులు పెళ్ళికి అందక పోవడంతో గ్రామంలో పరువు పోగుట్టుకుని ఎన్నో కుటుంబాలు ఊరివేసుకునే పరిస్థితి నెలకొన్నది అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో చలనం లేకపోవడం షోచ నీయమని అన్నారు. సహార భాధితులు ఒక్కో చోట ఒక్కో విషాద గాదలు. కోట్లల్లో డబ్బులను జమ చేసిన రోడ్డున పడ్డారని అన్నారు. సహార ఇండియా మోసానికి చావే శరణ్యమని అనుకున్న భాధిత కుటుంబాలకు సహార ఇండియా సంస్థ నుండి డబ్బులు వచ్చేవరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని అన్నారు. సహార ఇండియా సంస్థ ఏజెంట్లను నియమించి పేద కుటుంబాల వద్ద కోట్ల రూపాయలను వసూలు చేయించి ఏజెంట్ల జీవితాలను నట్టేట ముంచిందని అన్నారు. ఇల్లు కట్టుకోవడానికి సహార ఇండియా సంస్థలో దాచుకున్న డబ్బు సమయానికి సహార చెల్లించకపోవడంతో ఇల్లు కట్టుకోవాలన్నా కల కలగానే మిగిలిపోయిందని అన్నారు. అనంతరం సహార ఏజెంట్ వి బాలయ్య మాట్లాడుతూ...గత 15 సంవత్సరాల క్రితం సహార ఇండియా ఏజెంట్ల ద్వారా పొదుపు చేసిన పొదుపు డబ్బులు కాలపరిమితి పూర్తయి ఏడు సంవత్సరాలు గడిచిన ఈనాటికీ ఇవ్వకపోవడంతో ఖాతాదారులు సహార ఇండియా ఏజెంట్ల ఇండ్లపై దాడులకు దిగడంతో ఖాతాదారుల కుటుంబాలే కాక ఏజెంట్ల కుటుంబాలు రోడ్డున పడి చిన్నా భిన్నం అయ్యాయని అన్నారు. పరువు పోయిందని మనస్థాపంతో కొందరు ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, సహార ఖాతాదారులు సహార ఇండియా సంస్థలో జమ చేసిన డబ్బులు తిరిగి రావడంలేదని జీవోత్సవంల బ్రతుకుతున్నారని అన్నారు. సుప్రీంకోర్టులో 2012 నుంచి కేసు ఉండడం వల్ల కేసు పేరున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహారా ఇండియా సంస్థ కాలయాపన చేయడం వలన డబ్బులు వస్తాయా?రావా?అనే సంఘ్దిగ్ధంలో మునిగిపోయారని అన్నారు. గత ఏడు సంవత్సరాల ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి సెంట్రల్ రిజిస్టర్ కో ఆపరేటివ్ సొసైటీ( CRCS) ఆన్లైన్ పోర్టల్ ద్వారా 2023 మార్చి నాటికి బాండ్ కాలపరిమితి పూర్తయినవని అన్నారు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే 45 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా 2023 జూలై నెలలో ప్రకటిస్తే దాదాపు నాలుగు కోట్ల మంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే కేవలం 40 లక్షల మందికి 9000 వెయ్యిల కోట్లు మాత్రమే పోర్టల్ ద్వారా చెల్లించారని అన్నారు. పేదలు కడుపు చంపుకుని సంపాదించిన సొమ్మును సహార దగా చేసిందని అన్నారు. సహార ఇండియా సంస్థలో దేశంలోనే ఖాతాదారులు 13కోట్ల మంది డబ్బులు, మూడు లక్షల కోట్లకు పైగా డబ్బులు రావాల్సి ఉండగా కేవలం 9000 వెయ్యిల కోట్ల డబ్బులు మాత్రమే ఆన్లైన్ ద్వారా చెల్లించారని అన్నారు. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం కాలయాపనం చేయడం వలన ఇప్పటికీ వేలాదిమంది ఖాతాదారులు ఏజెంట్లు చనిపోయారని అన్నారు. ఎంతోమంది అనారోగ్యాలకు గురైనారని అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి 2023 జూలైలో మాట్లాడుతూ నాలుగు సొసైటీల డబ్బులు చెల్లిస్తామని పత్రిక ముఖంగా ప్రకటించి కేవలం క్రెడిట్ కోపరేటివ్ ఒక సొసైటీ సంబంధించిన స్కీం డబ్బులే ఇస్తున్నారని అన్నారు. పొదుపు చేసుకున్న డబ్బులు వస్తాయో లేదో అని మొగులుకు మొఖం పెట్టి ఖాతాదారులు ఎదురుచూస్తున్నారని అన్నారు. 2023 మార్చి 31 కాలం పూర్తయిన బాండ్స్ కి డబ్బులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ ను ప్రకటించడం వల్ల తర్వాత డేట్ అయిన వారికి డబ్బులు రానందున ఎన్నో ఇబ్బందులకు గురైతున్నారని అన్నారు. 2023 మార్చి 31 కటప్ డేట్ ను ఎత్తివేసి కాలం పూర్తయిన బాండ్స్ పూర్తి డబ్బులు సి ఆర్ సి ఎస్ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చెల్లించి ఖాతాదారులను ఆదుకోవాలని మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుచున్నామని అన్నారు. డబ్బులు రాని ఎడల ఖాదారులు, సహార ఏజెంట్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చివరకు చావే శరణ్యమని విలపిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సొమ్మును ఇప్పించి సహార భాధితులను ఆదుకోవాలని అన్నారు.