కడప జిల్లా కడప నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద అంబేద్కర్ సర్కిల్‌లో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి (NHRP పోరం) కడప జిల్లా అధ్యక్షుడు సి. నరసింహులు
కడప జిల్లా కడప నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద అంబేద్కర్ సర్కిల్‌లో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి (NHRP పోరం) కడప జిల్లా అధ్యక్షుడు సి. నరసింహులు ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.