కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
కడప జిల్లా కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ్ జ్యోతి 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లుతూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన అపార సేవలను స్మరించుకొని, ఆయన చూపిన మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.