logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కడప జిల్లా కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ నగర కోఆర్డినేటర్ బండి జకరయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు

కడప జిల్లా కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ నగర కోఆర్డినేటర్ బండి జకరయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ్ జ్యోతి, NSUI జిల్లా అధ్యక్షులు మావిల బాబు, RTI రాష్ట్ర చైర్మన్ కె. లక్ష్మయ్య, సత్తార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ స్మరణీయమని పేర్కొన్నారు.

4
673 views

Comment