logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మర్రి నరేష్ ​లయన్ డా. వి. సురేష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక 'డా. బి.ఆర్. అంబేద్కర్ లెగసీ - 2026' పురస్కారం


​నేరెడ్‌మెట్/మల్కాజ్‌గిరి:
సామాజిక సేవా రంగంలో అంకితభావంతో పనిచేస్తూ, నిరుపేదల దశాదిశ మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ లయన్ డా. వి. సురేష్ కుమార్ ని ప్రతిష్టాత్మక 'డా. బి.ఆర్. అంబేద్కర్ లెగసీ అవార్డు - 2026' వరించింది. డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా 'త్రేతాయుగ్ ఫౌండేషన్' ఈ గౌరవాన్ని ప్రకటించింది.
​రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత సేవలు
​తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నేరెడ్‌మెట్‌కు చెందిన సురేష్ కుమార్, గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో సైతం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక సేవా రంగంలో ఆయన చూపిస్తున్న చొరవ, విలువైన సహకారాన్ని గుర్తిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు త్రేతాయుగ్ ఫౌండేషన్ తమ ధృవీకరణ పత్రంలో పేర్కొంది.
​రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సేవ: డా. సురేష్ కుమార్
​ఈ సందర్భంగా డా. సురేష్ కుమార్ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. "భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఈ పురస్కారాన్ని అందుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ గుర్తింపు నాపై బాధ్యతను మరింత పెంచింది. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి, పేద ప్రజలకు అండగా నిలవడానికి ఈ అవార్డు నాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుంటాను," అని ఆయన స్పష్టం చేశారు.
​సురేష్ కుమార్ కి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల మేడ్చల్ జిల్లాలోని పలువురు ప్రముఖులు, గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధులు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక స్పృహ కలిగిన వ్యక్తికి తగిన గుర్తింపు లభించిందని వారు కొనియాడారు.

0
36 views

Comment