logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అంబేద్కర్ స్ఫూర్తి తో ఉద్యమిద్దాం-వేముల గోపినాధ్

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఘనమైన నివాళులు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పల్లె , పట్టణం, గల్లి,వాడవాడల ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయనను స్మరించుకోవడం అంటే ఆయన ఆశయాలు కనుగుణంగా ఆయన చూపిన మార్గాన్ని మనం భావితరాలకు అందించే గురుతరమైన బాధ్యత అంబేడ్కర్ వారసులపైన ఉంది. ఏప్రిల్ మాసం మహనీయుల జయంతి మాసంగా నిలిచింది. నేటి తరం అంబేద్కర్ ను, మహాత్మ జ్యోతిబాపూలే బాబు, జగ్జీవన్ రామ్ తో పాటు అనేకమంది మహానీయులను అధ్యయనం చేయాలి . మహనీయులు ఈ దేశానికి సమాజంలో భవిష్యత్తు తరాల కోసం అందించినటువంటి గొప్ప రచనలను ,వారి మార్గాలను తెలుసుకొని ముందుకు వెళ్లాలి. పాలకులు మహనీయులకు నివాళులు అర్పించడంతోపాటు వారు పేద ప్రజల పక్షాన నిలబడి వారు చూపిన మార్గాలను పేదలకు అందించాల్సిన ఫలాలను అందించినప్పుడే వారికి ఘనమైన నివాళులు అర్పించిన వారిగా అవుతారు.
పాలకులు మహనీయుల జీవిత చరిత్రను నేటి తరానికి అందించేందుకు ప్రత్యేకమైన కార్యక్రమాలను తీసుకుని, వారి యొక్క మార్గాలను వారు చూపిన దారిని వారు ఈ సమాజానికి చేసిన సేవలను ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. అంటరానితనంతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితిని ఆనాడు అంచనా వేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అణగారిన ప్రజల తరఫున గొంతుకై నిలిచి ఆయన అనేక రచనలతో పాటు అణగారిన వర్గాలకు భారత రాజ్యాంగం ద్వారా అనేక హక్కులను కల్పించారు.
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు,మేధావి, దళిత ధారకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్.1891 వ సంవత్సరంలోని ఏప్రిల్ 14న రాంజీ మలోజి సత్పాల్ భీం భాయ్ అనే దంపతులకు మధ్యప్రదేశ్లోని మాము గ్రామంలో మహార్ కులంలో అంబేద్కర్ జన్మించారు. 14 మంది సంతానంలో అంబేద్కర్ చివరివాడు. అంబేద్కర్ చిన్న వయసులో తాను అనుభవించినటువంటి స్థితిగతులను , మార్చుకునేందుకు జీవితంలో ఏదైనా సాధించాలని తపనతో ముందుకు రావాలంటే అది చదువుతోటే సాధ్యమని నమ్మాడు. అదే పట్టుదలతో ఉన్నంత చదువులు చదివాడు. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించాడు.నేడు సమాజంలో యువత మాదకద్రవ్యాల వైపు చెడు మార్గాలను అనుసరించకుండా ఉన్నంత మార్గాల వైపు ,ఆ దిశగా వెళ్లేందుకు ఉన్నంత చదువులు చదవాలి.పాలకులు ఆ దిశగా పేద ,బడుగు బలహీన వర్గాలకు ఉన్నంత చదువులు అందించి ,విద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి ప్రతి పేదవాడికి ధనిక పేద తేడా లేకుండా ఒకే విద్య సమానమైన విద్యాను అందించే విధంగా పాలకులు కృషి చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితమే ఓ స్పూర్తి, అన్ని వర్గాలకు, జాతులకు , మతాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాము.
చదువుకుంటే ఏదైనా సాధించవచ్చునని దారి చూపిన గొప్ప మేధావి. విద్యా అసలైన శక్తి అని, సమాజంలో దురాచారాలు పోవాలంటే హక్కులు అడగడం కాదు, సాధించుకోవాలని సమాజానికి చాటి చెప్పిన స్పూర్తి ప్రదాత అంబేద్కర్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి హక్కులు భరించ వెయ్యబడకుండా సన్మానమైన హక్కులు అమలుచేసి ప్రజల పొందే విధంగా ప్రజాపాలన కొనసాగించాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ జయంతి కేవలం ఒక జయంతి కాదు సమాజంలో సమానత్వం న్యాయం స్వాభిమానానికి నాంది పలికిన ఓ ఉద్యమ యోధుడికి విద్య పెద్దకి భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడికి అందించే ఘనమైన నివాళి. ఆయన అందించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని భారత ప్రజలకు హక్కులు అందే విధంగా ప్రతి ఒక్కరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఉద్యమిద్దాం. ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు కావలసిన అవసరాలను పాలకులు తీర్చే విధంగా ముందుకు వెళ్తూ,ప్రజలకు అండగా ఉంటూ మహనీయులు చూపిన బాటలో ప్రయాణిద్దాం.

వేముల గోపీనాథ్
Cell: 9666800045

7
1670 views

Comment