logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సముద్రసముద్ర జలాలలో చేపల వేట నిషేధం

సముద్ర జలాలలో చేపల వేట నిషేధం

ఏప్రిల్ 13 :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాదేశిక సముద్ర జలాలలో చేపల వేట చేయు యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్ , మోటరైజ్డ్ బోట్ల ద్వారా నిర్వహించు అన్ని రకాల చేపల వేటను ఏప్రిల్ 15నుండి మే 14..,2026 వరకు అనగా "61" రోజుల పాటు సముద్ర జలాలలో చేపల వేటను నిషేధిస్తూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడమైనదని జిల్లా మత్స్యశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

సముద్ర జలాలలో చేపల వేట నిషేధం ముఖ్య ఉద్దేశమని, చేప, రొయ్య, పీత జాతుల సంతానోత్పత్తి కాలములో తల్లి చేప,రొయ్య, పీతలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం తద్వారా సముద్ర మత్స్య సంపద సుస్థిరతను సాధించడం అని తెలిపారు.

సముద్ర మత్స్య సంపద పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం దృష్ట్యా విధించిన ఈ నిషేధ ఉత్తర్వులను అనుసరించి, సముద్ర జలాలలో యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్ మరియు మోటరైజ్డ్ బోట్ల ద్వారా మత్స్యకారులు ఎటువంటి చేపలవేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించగలరు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపలవేట చేసినచో ఆయా బోట్ల యజమానులు ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టము 1994, సెక్షన్ (4)ను అనుసరించి శిక్షార్హులు. బోట్లను, బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీనపరచుకొనుటయే గాక, జరిమానా విధిస్తూ, డీజిల్ ఆయిల్ రాయితీ, వేట నిషేధ భృతి, ప్రభుత్వం అందించే అన్ని రకాల రాయితీ సౌకర్యాలు నిలుపుదల చేయబడును.

ఈ నిషేధ కాలమును ఖచ్చితముగా అమలుచేయుటకై మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు మరియు రెవిన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేయడమైనది. కావున మత్స్యకారులు, మత్స్యకార పెద్దలు అందరూ సహకరించవలసిందిగా కోరడమైనది.
ప్రస్తుతం సముద్రములో చేపల వేటలో ఉన్న బోట్లు అన్ని ఏప్రిల్ 14 అర్ధరాత్రి లోపు ఒడ్డుకు చేరి పట్టుబడిచేసిన మత్స్య సంపదను మొత్తం అమ్మకం, రవాణా చేసుకోవాలని కోరారు.

నిబంధనలు ఉల్లంఘించి ఏప్రిల్.15.నుండి చేపల వేటలో పట్టుబడిచేసిన అన్నిరకాల మత్స్య సంపదను స్వాధీనపరచుకోని జరిమానా విధించబడును అని తెలిపారు.

ప్రస్తుతం తీరములో ఉన్నటువంటి బోట్లు దీర్ఘకాల చేపలవేట కు వెళ్ళరాదని పేర్కొన్నారు.

సముద్ర జలాలతో చేపలవేట నిషేధ భృతి లబ్ధిదారుల ఎన్యుమరేషన్ (వివరాల సేకరణ) ఈ నెల 17వ తారీఖున జరుగును. కనుక సంబంధిత బోటు యజమానులు, కళాసీలు బోటు వారీగా, బోటుతో సహా మత్స్యశాఖ అధికారులకు అందుబాటులో ఉండవలసినదిగా కోరినట్లు ఒక ప్రకటన లో తెలిపారు.

0
12 views

Comment