బుగ్గారంలో లైబ్రరీ ఏర్పాటు చేద్దాం....
జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్ శర్మ
శాలువాతో సత్కరించి శుభా కాంక్షలు తెలిపిన చుక్క గంగారెడ్డి
బుగ్గారంలో లైబ్రరీ ఏర్పాటు చేద్దాం....
జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్ శర్మ
శాలువాతో సత్కరించి శుభా కాంక్షలు తెలిపిన చుక్క గంగారెడ్డి
బుగ్గారం / జగిత్యాల జిల్లా:
పాత నియోజక వర్గ కేంద్రమైన బుగ్గారం మండల కేంద్రంలో గ్రంథాలయ భవనం నిర్మించి లైబ్రరీ ఏర్పాటు చేద్దామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జగిత్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనబట్ల దినేష్ శర్మ అన్నారు. తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు, బుగ్గారం విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి దినేష్ శర్మ ను ధర్మపురిలో కలిశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శాలువాతో సత్కరించి శుభా కాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుకుంటూ బుగ్గారం మండల కేంద్రంలో స్థలం చూసి, లైబ్రరీ భవనం నిర్మించాలని చుక్క గంగారెడ్డి కోరగా దినేష్ శర్మ సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు. యువతకు, విద్యార్థినీ - విద్యార్థుల కోసం త్వరలోనే లైబ్రరీ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించుకున్నారు.