న్యాయవ్యవస్థలో AI వాడకంపై గుజరాత్ హైకోర్టు నిషేధం
తెలంగాణ స్టేట్ ** ఏప్రిల్ 13**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
*న్యాయవ్యవస్థలో AI వాడకంపై గుజరాత్ హైకోర్టు నిషేధం*
AI విస్తరిస్తున్న నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు న్యాయ వ్యవస్థలో దాని వాడకాన్ని నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక విధుల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది AIని వినియోగించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తీర్పులు రాయడం, చట్టాల విశ్లేషణ, బెయిల్ మంజూరు వంటి కీలక అంశాల్లో మానవ మేధస్సే అత్యంత కీలకమని, AI ప్రమేయం ఉండకూడదని కోర్టు తెలిపింది. శిక్షలు ఖరారు చేసేటప్పుడు మానవ విచక్షణపైనే ఆధారపడాలని, Alని ప్రామాణికంగా తీసుకోకూడదని పాలసీలో స్పష్టం చేసింది.