నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం
యాదాద్రి భువనగిరి జిల్లా
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:
- పేదల స్వప్నమైన సొంతింటి కలను నెరవేర్చడమే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
- ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు ని మంజూరు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
- కొత్త ఇళ్లలో ప్రవేశించిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కుటుంబాలు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
- ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ నాయకులు మహిళా సంఘాల సభ్యులు
గ్రామ ప్రజలు పాల్గొన్నారు