logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హజ్ యాత్రికుల కోసం శిక్షణ శిబిరం – మరియు వైద్య శిబిరం ముఖ్యఅతిథిగా మహమ్మద్ అలీ షబ్బీర్

కామారెడ్డి జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో దేవునిపల్లి లోని లక్ష్మీదేవి ఫంక్షన్ హాల్‌లో ఈ ఏడాది హజ్‌కు వెళ్లనున్న యాత్రికుల కోసం హజ్ శిక్షణ శిబిరం ఈ రోజు ఘనంగా నిర్వహించారు.

ఉదయం ప్రారంభమైన ఈ శిక్షణ శిబిరం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగగా, జిల్లాకు చెందిన హజ్ యాత్రికులందరూ పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందారు.

ఈ శిక్షణ శిబిరాన్ని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

కార్యక్రమంలో మైనార్టీ మత పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమాశ్రీనివాస్ కూడా పాల్గొని యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మత పండితులు హజ్ యాత్రకు సంబంధించిన ముఖ్యమైన ధార్మిక నియమాలు, విధి విధానాలు, హజ్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రయాణ ఏర్పాట్లు, వసతి, రవాణా తదితర లాజిస్టిక్ అంశాలపై యాత్రికులకు సమగ్ర అవగాహన కల్పించారు.

హజ్ యాత్రలో ఎదురయ్యే సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా స్పష్టంగా వివరించారు. మహిళా హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక కూర్చోవడం మరియు మార్గనిర్దేశం ఏర్పాటు చేయడం విశేషం.

శిక్షణ శిబిరంలో పాల్గొన్న హజ్ యాత్రికులు తమ సందేహాలను నేరుగా మత పండితులు, నిర్వాహకులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ శిక్షణ శిబిరం వల్ల హజ్ యాత్రను సక్రమంగా, భక్తి భావంతో, సురక్షితంగా నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని యాత్రికులు తెలిపారు.

ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడుతూ.

హజ్ యాత్రికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ నుంచి హజ్‌కు వెళ్లే ప్రతి యాత్రికుడికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. మక్కాలో కూడా ఇక్కడి నుంచి వెళ్లే హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సహాయ సేవలు, సౌకర్యాలు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు పాల్గొని శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేశారు.

9
396 views

Comment