logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కడప జిల్లా కడప నగరంలో శుభమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

కడప జిల్లా కడప నగరంలోని ఎరుముక్కపల సర్కిల్ వద్ద, మానస ఇన్ రెస్టారెంట్ ఎదురుగా శుభమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప నగరం ట్రాఫిక్ ఇన్‌చార్జ్ సురేష్ రెడ్డి హాజరై ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా ప్రయాణికులు, స్థానికులు ఉపశమనం పొందారు.
ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ వెంకటరమణ, సాయి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.

3
457 views
1 shares

Comment