సాహితీ జూనియర్ కాలేజ్ ఇంటర్ బైపిసి ఫలితాలలో సత్తా చాటిన కుంట రీతు లాస్విత ఇల్లందు విద్యార్థిని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంకు చెందిన కుంట రీతు లాస్విత ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో 1000 మార్కులకు గాను 973 ఇంటర్మీడియట్ బైపిసి గ్రూప్ ఇల్లందు టౌన్ ఫస్ట్ మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది. విద్యార్థిని సాధించిన ఈ అత్యుత్తమ ఫలితాలలో ఇల్లందు టౌన్ కు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు కుంట రాజు, శాంతి ఆనందం వ్యక్తం చేయగా,సాహితీ కాలేజ్ యాజమాన్యం కరెస్పాండంట్ నాగిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.పట్టణ ప్రజలు విద్యార్థిని కి శుభాకాంక్షలు తెలిపారు