logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కర్నూలు జిల్లా క్రికెట్ జట్టుకు ఆళ్లగడ్డ క్రీడాకారిణుల ఎంపిక.

AIMA న్యూస్. నంద్యాల జిల్లా. కర్నూలులో ఆదివారం నిర్వహించిన బాలికల జిల్లా స్థాయి క్రికెట్ ఎంపికల్లో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన సోముల రమణారెడ్డి (RR) అకాడమీ క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటుకున్నారు. అండర్-15, అండర్-19, అండర్-23 విభాగాల్లో జరిగిన ఈ సెలక్షన్స్‌లో అకాడమీకి చెందిన ముగ్గురు క్రీడాకారిణులు జిల్లా జట్టుకు ఎంపికైనట్లు నిర్వాహకులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎస్.వి.ఎన్. హరిప్రసాద్ రెడ్డి మరియు ఎం. సుజాతా రెడ్డి ప్రకటించారు.
సాయి నికితా రెడ్డి: బ్యాటర్ (అండర్-23 విభాగం)రిశ్వహర్షిని వికెట్ కీపర్
మేఘన మీడియం పేస్ బౌలర్.
ఈ సందర్భంగా సోమవారం నాడు ఎం. సుజాతా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి దివంగత సోముల రమణారెడ్డి ఆళ్లగడ్డలో క్రికెట్ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయ సాధన కోసమే ఆళ్లగడ్డలో ఆర్.ఆర్. అకాడమీని స్థాపించి, క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నేడు అకాడమీ నుండి ముగ్గురు అమ్మాయిలు జిల్లా జట్టుకు ఎంపిక కావడం గర్వకారణమని, భవిష్యత్తులో జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే తమ లక్ష్యమని ఆమె ఆకాంక్షించారు.
జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులను అకాడమీ నిర్వాహకులతో పాటు, వారికి శిక్షణ ఇస్తున్న కోచ్ సుబ్బారాయుడును పలువురు క్రీడా అభిమానులు అభినందించారు.

33
1126 views

Comment