కడపలో పుట్లంపల్లి చెరువు కట్ట రోడ్డు పనులకు భూమి పూజ చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు మరియు ఎమ్మెల్యే మాధవి గారు..
కడపలో పుట్లంపల్లి చెరువు కట్ట రోడ్డు పనులకు భూమి పూజ చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు మరియు ఎమ్మెల్యే మాధవి గారు..
కడప నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. కడప నగరం 15వ డివిజన్ పరిధిలోని పుట్లంపల్లి చెరువు కట్ట రోడ్డు పనుల భూమి పూజ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి, పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని, నిర్ణీత కాల వ్యవధిలో ఈ రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి,స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పుట్లంపల్లి ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.