logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రోలుగుంట, మాకవరపాలెం, రావికవతం మండలాల్లో పల్లె ప్రతిభా కేంద్రం (ఐఐటి-నీట్) ప్రారంభం

అనకాపల్లి జిల్లా: ఆదివారం రోలుగుంట, మాకవరపాలెం, రావికవతం మండలాల్లో పల్లె ప్రతిభా కేంద్రం (ఐఐటి-నీట్) ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిల్లాడ సత్యనారాయణ ఐపీఎస్, వేద విద్యా డైరెక్టర్ పోతన ప్రసాద్ నాయుడు విచ్చేశారు.
ఫిజిక్స్ వాలా సౌజన్యంతో గత నెల రోజులుగా నిర్వహించిన ఐఐటి-నీట్ కోచింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడించారు. ఫలితాల్లో స్థానం సాధించిన విద్యార్థులకు మండలానికి సుమారు 75 మంది చొప్పున ఎంపిక చేశారు.
కిల్లాడ సత్యనారాయణ ఐపీఎస్ మాట్లాడుతూ, పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికి కోచింగ్ అవకాశం ఉంటుందని, మిగతా విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, దానికి కావలసిన దిశా నిర్దేశాలు ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైనవారికి ఉచిత కోచింగ్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఈ నెల 17వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రస్తుతం 7,8,9 తరగతులు చదువుతున్న ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని పొంది ఉన్నత శిఖరాలు చేరాలని ఆశించారు.
జాతీయ ఓబీసీ అధ్యక్షుడు, వేదా విద్యా డైరెక్టర్ పోతన ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ, పరీక్ష ఫలితాల్లో స్థానం సాధించని విద్యార్థులు నిరాశపడవద్దని, వారికి ప్రస్తుతం మెటీరియల్ కోసం కొంత రుసుము వసూలు చేస్తూ ప్రతి మూడు నెలలకు పరీక్షలు నిర్వహించి, ప్రతిభ చాటినవారికి మరలా ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించే క్లాసులకు హాజరుకోవాలని, దానికి తల్లిదండ్రులు పూర్తి బాధ్యత వహించాలని కోరారు.
స్థానిక రోలుగుంట ఎస్సై జి రామకృష్ణ మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలో కిల్లాడ సత్యనారాయణ చేతుల మీదుగా పేద విద్యార్థుల కోసం ఇటువంటి మంచి కార్యక్రమం ప్రారంభించడం జిల్లా ప్రజల అదృష్టమని, ప్రతి విద్యార్థి బంగారు భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. దీనికి ఎంతో సానుకూలంగా స్పందించిన తల్లిదండ్రులు తమ విద్యార్థులకు భవిష్యత్తు కొరకు పిల్లాడు సత్యనారాయణ, పోతన ప్రసాద నాయుడు, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు ఇది గ్రామీణ ప్రాంతీయ పేద విద్యార్థులకు మంచి అవకాశం అని ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని ఇటువంటి మహత్కార్యం చేపట్టిన పెద్దలకు ధన్యవాదాలు పలువురు హర్షం వ్యక్తం చేశారు

4
244 views

Comment