logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ రెండవ ర్యాంకు సాధించిన గడివేముల శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల విద్యార్థిని బి శ్రీ భారతి.

గడివేముల (AIMA MEDIA ): గడివేముల ఈనాడు రిపోర్టర్ బి శ్యాంసుందర్ రెడ్డి కుమార్తె బి.శ్రీ భారతి గడివేముల శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల నందు నర్సరీ నుండి పదవ తరగతి వరకు చదివి గత సంవత్సరం 10వ తరగతిలో 600కు గాను 587 మార్పు సాధించి గడివేముల మండల టాపర్గా నిలిచారు. ఏప్రిల్ 12వతేది ఆదివారం ఇంటర్ మొదటి సంవత్సరం వెలువడిన ఫలితాలలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అ యాతి కాలేజీ నందు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎం.పీ.సీ గ్రూపులో 470 మార్కులకు గాను 468 మార్కు సాధించి తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ రెండవ ర్యాంకు సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ రెండవ ర్యాంకు సాధించిన బి శ్రీ భారతి నీ శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ ఎం రామేశ్వరరావు, మరియు పాఠశాల ఏవో ఎం రాఘవేంద్రరావు మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అభినందించారు.

1
735 views

Comment