logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఫిట్నెస్ లేకపోయినా ఫుల్ స్పీడ్ ఇల్లెందులో ప్రైవేట్ అంబులెన్స్ల ఇష్టారాజ్యం

ప్రైవేట్ అంబులెన్స్ల దోపిడీపై కలెక్టర్ అంకిత్ కు వినతి పత్రం
అందజేసిన బాధితుడు
ఇల్లందు AIMA మీడియా: ఇల్లందులో ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్సు ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారు తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిట్నెస్ సర్టి ఫికేట్ లేకుండా, అవసరమైన పరికరాలు లేకుండా రోడ్లపై దూసుకెళ్తున్న అనేక ప్రైవేట్ అంబులెన్సులు ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియంత్రణలో ఉండాల్సిన యజ మానులు మాత్రం 'ఆపే వారెవ్వరు' అన్న ధీమాతో నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. మరోవైపు, పత్రాలు లేని వాహనాలు నిర్బంధం లేకుండా నడుస్తుండటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.దండుకుంటున్న యజమానులు,రోగులను ఆసుపత్రులకు తరలించే అత్యవసర సేవగా ఉండాల్సిన అంబులెన్స్ సేవలు ఇప్పుడు వ్యాపారంగా మారిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు కుటుంబాల వద్ద నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ప్రాణ భయంతో ఉన్న బాధితులు అడిగినంత చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ దోపిడీని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అంబులెన్సుల
ప్రైవేట్ అంబులెన్సులపై ఫిర్యాదులు వచ్చాయి.
హర్షవర్ధన్, హైమా మీడియా ఇల్లందు వైద్యశాల సూపరింటెండెంట్
ప్రైవేట్ అంబులెన్స్ల విషయంలో పలు ఫిర్యాదులు అందాయి. ఈ విషయంపై ఉన్నత అధికారులకు, సంబంధిత ఆర్టీఏ అధికారులకు సమాచారం ఇచ్చి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తా.
కొరత కూడా ప్రైవేట్ వాహనాలకు వరంగా మారింది. అందుబాటులో ప్రభుత్వ సేవలు లేకపోవడంతో ప్రజలు బలవంతంగా ప్రైవేట్ అంబులెన్సులపై ఆధార పడుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని యజ మానులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపన లు ఉన్నాయి.
ఆర్టీఏ అధికారులు స్పందిస్తారా..?
రోడ్డు రవాణాశాఖ (ఆర్టీఏ) అధికారులు వెంటనే స్పందించి, ఫిట్నెస్ లేని అంబులెన్సులపై ప్రత్యేక దాడులు నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అన్ని అంబులెన్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫి కేట్, అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయా లేదా అన్నదాన్ని కఠినంగా తనిఖీ చేయాలని ప్రజలు కోరు తున్నారు. అలాగే, అధిక చార్జీలు వసూలు చేసే యజ మానులపై కఠిన చర్యలు తీసుకుని, అత్యవసర సేవలపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

56
6080 views

Comment