మార్కుల సునామి సృష్టించిన ఎస్ఆర్ జూనియర్ కళాశాలకొత్తగూడెం...
రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంక్
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎస్ ఆర్ కొత్తగూడెం మహిళా కళాశాల మార్కుల ప్రభంజనాన్ని సృష్టించింది.
రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకుతో పాటు మరెన్నో అత్యధిక ఫలితాలతో కొత్తగూడెంలో ప్రభంజనాన్ని సృష్టించి ఎస్ ఆర్ కీర్తి పతాకాన్ని ఎగరవేసింది.
ఈ ఫలితాలలో రెండవ సంవత్సరం ఎంపీసీ ఫ్లోరెన్స్ రూత్ 996/1000 మార్కులతో స్టేట్ రెండవ ర్యాంక్, బైపిసి విభాగంలో ఆన్సా అస్మిన్ 992/1000, ప్రథమ సంవత్సరం బైపిసిలో మేఘన, దీక్షిత 437/440 మార్కులు, ఎంపీసీ దుర్గా, హర్షిత, ఐశ్వర్య లక్ష్మి, వైష్ణవి 465/470 మార్కులతో ప్రభంజనాన్ని సృష్టించారు. ఇవి కాక రెండవ సంవత్సరంలో 11 మందికి 980 మార్కుల కంటే పైన,
ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 8 మందికి 460 మార్కుల కంటే పైన, ప్రథమ బైపిసి విభాగంలో 7 గురికి 430 మార్కుల కంటే పైన మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో ఎస్ ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరద రెడ్డి గారు మాట్లాడుతూ పటిష్టమైన విద్యా ప్రణాళిక, అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల సహాయ సహకారాలతో మరియు క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు ఉండడం వలన ఇటువంటి రికార్డులు సృష్టించడం సాధ్యమైందని, ప్రణాళిక బద్ధమైనటువంటి షెడ్యూల్ తో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా వారు అనుకున్న గమ్యాన్ని సాధించేందుకు వారిలో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు అధ్యాపక బృందం ప్రయత్నంతోనే ఇది సాధ్యమైందని తెలియజేశారు. అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థులను డైరెక్టర్స్ మధుసూదన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి, డీజిఎం గోవర్ధన్ రెడ్డి, కొత్తగూడెం జోనల్ ఇంచార్జ్ సతీష్, ప్రిన్సిపల్ అశోక్ అధ్యాపక అధ్యాపక ఇతర బృందం తల్లిదండ్రులు పాల్గొని అభినందించారు.