logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇరాన్ సముద్రం లో మైన్స్ ఎక్కడ పెట్టిందో మరిచిపోయిందట! ఇరాన్-అమెరికా యుద్ధం

ఇరాన్ సముద్రం లో మైన్స్ ఎక్కడ పెట్టిందో మరిచిపోయిందట!

ఇరాన్-అమెరికా యుద్ధం మొదలైనప్పటినుంచీ టాక్ ఆఫ్ ది టాపిక్ గా ప్రతిరోజూ, ప్రతిక్షణం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద హాట్ న్యూస్ గా మారిన హర్మూజ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఆ మార్గంలో రాకండి, వేరే మార్గాల్లో వెళ్లండి అంటూ ఇరాన్ పదేపదే చెప్తుండటానికి కారణం ఏమిటో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హర్మూజ్ జలసంధిలోకి చొరబాట్లను నిలువరించేందుకు తాము పెట్టిన సీమైన్స్..ఎక్కడెక్కడ
వున్నాయో ఇరాన్ మరిచిపోయిందట. ఈ పరిస్థితి అమెరికాకు మరో తలనొప్పిగా తయారైంది. అవి ఎక్కడెక్కడ వున్నాయో గుర్తించడం ఎలా అని జుట్టు పీక్కుంటోంది.

ఇక్కడ ఇప్పుడు ఒక వింత యుద్ధం నడుస్తోంది. దీన్ని ఫిజికల్ వార్ అనడం కంటే ప్యూర్ సైకలాజికల్ గేమ్ అనడం కరెక్ట్. ఇరాన్ వేస్తున్న ఎత్తుగడ ఇప్పుడు అమెరికాకు నిద్ర లేకుండా చేస్తోంది. మందుపాతరలు పెట్టడం ఒక ఎత్తు. అవి ఎక్కడ ఉన్నాయో మాకే తెలియదు అని చెప్పడం అసలైన మాస్టర్ ప్లాన్.

యుద్ధం అంటే తుపాకులు పేల్చడం మాత్రమే కాదు. శత్రువు మెదడులో అయోమయాన్ని నింపడం. ఇరాన్ సరిగ్గా అదే చేస్తోంది. మేము మైన్లు పెట్టాం. కానీ అవి ఎక్కడ ఉన్నాయో మర్చిపోయాం. ఇప్పుడు సముద్రపు అలల వల్ల అవి ఎటు కొట్టుకుపోయాయో మాకే తెలియదు. ఈ ఒక్క స్టేట్‌మెంట్ మొత్తం సీ రూట్‌ను ఒక డెత్ ట్రాప్‌గా మార్చేసింది. ఇక్కడ ఇరాన్ తన అసమర్థతను ఒక ఆయుధంగా వాడుకుంటోంది. దీన్నే స్ట్రాటజిక్ ఇన్‌కాంపిటెన్స్ అంటారు. కావాలనే మేం పొరపాటు చేశాం అని చెప్పి శత్రువును పరేషాన్ చేయడం దీని ఉద్దేశం.

అమెరికా దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ ఉంది. కానీ ఒక మైన్ ఎక్కడ ఉందో తెలిస్తే దాన్ని తీసేయొచ్చు. అసలు ఎక్కడ ఉందో తెలియనప్పుడు ప్రతి నీటి అల ఒక బాంబులా కనిపిస్తుంది. ఇది ఒక రకమైన అదృశ్య భయం. ఈ గందరగోళం వెనుక ఇరాన్ ఆశిస్తున్న అసలు పాయింట్ నియంత్రణ. ఇరాన్ విడుదల చేసిన మ్యాప్‌లో కొన్ని సేఫ్ రూట్స్ చూపించారు. ఆ మ్యాప్ జాగ్రత్తగా గమనిస్తే అసలు రంగు బయటపడుతుంది. ఆ దారులన్నీ ఇరాన్ తీరానికి లేదా లారక్ ఐలాండ్‌కు చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే ప్రపంచ దేశాల నౌకలన్నీ ఇప్పుడు ఇరాన్ కంటి కింద వాళ్ళ పర్యవేక్షణలోనే వెళ్ళాలి. ఇది భద్రత కోసం చూపించిన దారి కాదు. ఇది ఇరాన్ విరిసిన ఒక వల. వాళ్ళ అనుమతి లేనిదే ఆ దారిలో ఒక పడవ కూడా కదలలేని పరిస్థితిని సృష్టించారు.

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడింది. యుద్ధ నౌకలను పంపాలా లేక వెనక్కి తగ్గాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. వెళ్తే మైన్లు పేలే ప్రమాదం ఉంది. వెళ్లకపోతే సూపర్ పవర్ అన్న పరువు పోతుంది. ఈ మైన్లు కేవలం చమురు ట్యాంకర్లను ఆపడానికి కాదు. ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి పెట్టారు. ఆయిల్ రేట్లు పెరిగితే ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంది. ఇరాన్ ఆడుతున్న ఈ చదరంగంలో ప్రతి నౌక ఒక పావు మాత్రమే.

యుద్ధ తత్వశాస్త్రం ప్రకారం శత్రువును గెలవాలంటే ముందు వాడి ధైర్యాన్ని చంపాలి. ఇరాన్ ఇప్పుడు అదే చేస్తోంది. టెక్నాలజీ కంటే అనిశ్చితి (Uncertainty) చాలా పవర్‌ఫుల్ అని నిరూపిస్తోంది. ఒక దేశం తాను పెట్టిన మైన్లనే మర్చిపోయింది అంటే అది జోక్ కాదు. అది ఒక భయంకరమైన వార్నింగ్. ఇక్కడ ఆయుధాల కంటే ఐడియాలకే బలం ఎక్కువ. గెలుపు ఎవరిదో తెలియదు కానీ భయం మాత్రం అందరినీ వెంటాడుతోంది.

ఈ ఆటలో ఇంకా లోతైన పొరలు ఉన్నాయి. హర్మూజ్ జలసంధిలో జరుగుతున్నది సామాన్యమైన సరిహద్దు తగాదా కాదు. ఇది ఒక 'గ్రే జోన్' వార్‌ఫేర్. ఇక్కడ నిప్పు కనిపిస్తుంది కానీ మంటలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఈ యుద్ధ తంత్రంలోని మరికొన్ని నిగూఢమైన కోణాలు ఇప్పుడు చూద్దాం.

అదృశ్య మందుపాతర: భయం అనే ఆయుధం
యుద్ధంలో ఒక సామెత ఉంది. నీకు కనిపించే శత్రువు కంటే, ఎక్కడ ఉన్నాడో తెలియని శత్రువు ఎక్కువ ప్రమాదకరం. ఇరాన్ పెట్టిన మైన్లు పేలక్కర్లేదు. అవి అక్కడ ఉన్నాయన్న 'అనుమానం' చాలు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా?

నౌకల ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆకాశాన్ని తాకుతాయి. ఒక్క రోజులోనే షిప్పింగ్ చార్జీలు రెట్టింపు అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరుగుతాయి. బాంబు పేలకుండానే ఆర్థిక వ్యవస్థకు గాయం తగులుతుంది. ఇది ఒక రకమైన 'ఎకనామిక్ టెర్రరిజం'. ఇరాన్ కు కావాల్సింది కూడా ఇదే. అమెరికాకు బుద్ది చెప్పడానికి వాళ్ళు పెద్ద యుద్ధం చేయనక్కర్లేదు. ప్రపంచ మార్కెట్లో కాస్త గందరగోళం సృష్టించినా చాలు.

లారక్ ట్రాప్: గిల్లి కజ్జాల వ్యూహం
మ్యాప్‌లో ఇరాన్ చూపించిన ఆ సేఫ్ రూట్స్ వెనుక ఒక పెద్ద రాజకీయ కుతంత్రం ఉంది. ఆ దారులన్నీ లారక్ ఐలాండ్‌కు ఆనుకుని వెళ్తాయి. అంటే మీరు ప్రపంచానికి అగ్రరాజ్యం కావచ్చు. మీ దగ్గర అత్యాధునిక యుద్ధ విమానాలు ఉండొచ్చు. కానీ ఈ దారిలో వెళ్ళాలంటే మాత్రం ఇరాన్ అధికారులకు సలాం కొట్టాలి.

వాళ్ళు మీ నౌకలను ఆపుతారు. తనిఖీలు చేస్తారు. డాక్యుమెంట్లు అడుగుతారు. కావాలని ఆలస్యం చేస్తారు. అంటే ఇండైరెక్ట్‌గా ఆ ప్రాంతం మీద తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. ఇది కేవలం దారి చూపించడం కాదు. "మా గల్లీలోకి వస్తే మా రూల్స్ పాటించాలి" అని చెప్పడం. ఒక రకంగా ఇది అమెరికా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య.

చర్చల ముసుగులో చదరంగం
పాకిస్తాన్‌లో శాంతి చర్చలు జరుగుతున్నాయని మనం వింటున్నాం. కానీ గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి వేరుగా ఉంది. చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ మైన్ల గురించి ఇలాంటి వార్తలు వదలడం వెనుక ఒక లెక్క ఉంది. చర్చల టేబుల్ దగ్గర తమకు అనుకూలమైన డీల్స్ కుదుర్చుకోవడానికి ఈ మైన్లను వాళ్ళు ఒక 'బేరసారాల సాధనం'గా వాడుకుంటున్నారు.

"మీరు మాపై ఉన్న ఆంక్షలు తొలగించండి. అప్పుడు మేము ఆ మైన్లను వెతికి తీసేస్తాం" అని ఇరాన్ మెలిక పెట్టే అవకాశం ఉంది. అంటే తన తప్పునే ఒక పరిష్కారంగా చూపిస్తూ లబ్ధి పొందడం. ఇది పక్కా ప్రొఫెషనల్ వార్ గేమింగ్.

యుద్ధం ఒక మాయ
యుద్ధ తత్వశాస్త్రం ప్రకారం నిజం అనేది యుద్ధంలో మొదటి బలి అవుతుంది. ఇరాన్ నిజంగానే మైన్లు మర్చిపోయిందా? లేక మర్చిపోయినట్టు నటిస్తోందా? అమెరికాకు నిజంగానే అవి దొరకడం లేదా? ఇవన్నీ ఒక పెద్ద నాటకంలో భాగాలు.

సముద్రం అడుగున ఉన్న మైన్ల కంటే, మనుషుల మెదడులో ఉన్న సందేహాలే ఇప్పుడు ఎక్కువ శక్తివంతమైనవి. హర్మూజ్ జలసంధిలో ఇప్పుడు ఎగిరే ప్రతి జెండా భవిష్యత్తులో రాబోయే కొత్త ప్రపంచ క్రమానికి సంకేతం. గెలుపు అనేది ఆయుధాల బలం మీద లేదు. ఆ గందరగోళాన్ని ఎవరు తమకు అనుకూలంగా మార్చుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంది.

ఈ గేమ్ లో ఇరాన్ కోరుకున్నది దొరికింది. అదే అటెన్షన్. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇరాన్ చెప్పినట్టే వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక చిన్న అబద్ధం లేదా ఒక చిన్న మతిమరుపు ఇంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని ఎవరూ ఊహించలేదు.

2
646 views

Comment