ఆంధ్ర విశ్వ కళా పరిషత్
రంగ సంస్థ విభాగం
తేదీ 11.04.26
ఆంధ్ర విశ్వ కళా పరిషత్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్ర యూనివర్సిటీలో ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన రంగస్థల విభాగం కూడా ఈ ఉత్సవాలలో భాగస్వామ్యం అయ్యింది. ఈ విభాగం పేరెన్నికగన్న కళాకారులను ఈ దేశానికి అందించింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ విభాగం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించ తలపెట్టింది. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉత్సవం ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో రంగస్థలం విభాగం పూర్వ విద్యార్థులు కూడా పాల్గొనాలని అధికారిక ఆహ్వానం అందింది.
ఈ మేరకు మన అధ్యాపకుల సమక్షంలో 11 వ తేదీ అంటే శనివారం సాయంత్రం థియేటర్ లో సన్నాహక సమావేశం జరిగింది. మన అధ్యాపకులు డాక్టర్ మరపట్ల భాస్కరరావు, డాక్టర్ శశి భూషణ్ స్వామి మీగడ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు పూర్వ విద్యార్థులు, ఫ్యాకల్టీ మెంబర్స్ పాల్గొన్నారు. రంగస్థలం విభాగం పూర్వ విద్యార్థులందరికీ సమాచారం చేర వేసి 19వ తేదీన జరిగే వేడుకల్లో పాల్గొనే విధంగా సహకరించాలని అధ్యాపకులు కోరారు అదేవిధంగా రంగస్థలం విభాగం పూర్వ విద్యార్థుల సంఘాన్ని పునః ప్రారంభానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు కొంత మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తొలి ప్రయత్నం 2017 లో ప్రారంభించిన ఈ గ్రూపును పట్టిష్టపరచాలని సమావేశం నిర్ణయించింది. గౌరవనీయులు సత్య మూర్తి గారి సారథ్యంలో ఇంత కాలం కొనసాగిన ఈ గ్రూపులో సభ్యులందరూ చేరాలని మనవి చేస్తున్నాం. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ముందుకొచ్చిన వారి పేర్లు తెలియజేస్తున్నాం.
N. Maheswara Rao
Akiri Suresh
Senapati Mahesh
Ambati Vijay Raghavan
SVV Sathy Murthy
N. Syamala Rao
P. Giri Babu
B. Durga sarada
ప్రాథమికంగా ఎనిమిది మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు అయ్యింది ఉత్సవాలు ఎవరైనా ముందుకు వస్తే వారిని కూడా కలుపుకొని మన పూర్వ విద్యార్థుల వ్యవస్థను పటిష్టంగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేద్దాం.