కడప జిల్లా కడప నగరంలో ఎస్పీ ఆదేశాల మేరకు
కడప జిల్లా కడప నగరంలో ఎస్పీ ఆదేశాల మేరకు చిన్న చౌకు సీఐ ఓబులేష్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఇటీవల దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అలాగే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసరాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయకుండా పోలీసులకు తెలియజేయాలని సీఐ తెలిపారు. ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు.