logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆరోగ్య వారోత్సవాలు * పాల్గొన్న జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య ,*డీఎం & హెచ్ ఓ డాక్టర్ తుకారం రాథోడ్,

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** ఏప్రియల్ 11**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి )


డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆరోగ్య వారోత్సవాలు

*ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య ,
*డీఎం & హెచ్ ఓ తుకారాం రాథోడ్,

*అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు ర్యాలీ,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏప్రిల్ 11: (కానుక న్యూస్ జిల్లా ప్రతినిధి) ) తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు.మందుల నాణ్యత, లభ్యత నిబంధనల అమలును నిర్ధారించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో డ్రగ్స్ కంట్రోల్ విభాగం అధికారులు ఈ క్రింది అంశాలపై వివరణాత్మక సమాచారాన్ని అందించారు: అలవాటుగా మారే మందుల దుర్వినియోగం వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన. యాంటీబయాటిక్స్ దుర్వినియోగం యాంటీ-మైక్రోబియల్ రెసిస్టెన్స్ (సూక్ష్మజీవుల నిరోధకత)షెడ్యూల్ హెచ్ 2 మందుల కోసం క్యుఆర్ కోడ్ వెరిఫికేషన్‌ను ప్రోత్సహించడం.
క్యు ఆర్ కోడ్ ఆధారంగా మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలను (సైడ్ ఎఫెక్ట్) రిపోర్ట్ చేయడం.లైసెన్స్ పొందిన ఫార్మసీల ఆన్‌లైన్ వెరిఫికేషన్.నకిలీ మందులకు సంబంధించి ఫిర్యాదుల కోసం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్‌లైన్ (1800-599-6969) వినియోగం.ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల విద్యార్థులు, ఫార్మసిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు కలిపి సుమారు 150 మంది పాల్గొన్నారు. అవగాహన యాత్రలో భాగంగా ముందుగా ర్యాలీ నిర్వహించి, అనంతరం కూలీ లైన్ లోని కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ భవన్‌లో సదస్సును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడకూడదని, యాంటీబయాటిక్స్‌ను దుర్వినియోగం చేయకూడదని మందులను బాధ్యతాయుతంగా వాడాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య డీఎం & హెచ్ ఓ తుకారాం రాథోడ్ హాజరయ్యారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో విద్యార్థులు ఆరోగ్య రంగ భాగస్వాముల పాత్ర ఎంత కీలకమో వారు వివరించారు. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థుల కోసం వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహించగా, విజేతలకు ప్రోహిబీషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి. విజయ్ రామ్ కుమార్, , ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈగల్ ఇన్స్పెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.జిల్లా కెమిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు తిరుపతి రెడ్డి, అధ్యక్షులు), రవి కార్యదర్శి లక్ష్మణచారి (కోశాధికారి) అసోసియేషన్ సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు.ఖమ్మం సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో తాము కట్టుబడి ఉన్నామని, అలవాటుగా మారే మందుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మందుల సరైన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు.

13
48 views

Comment