🟥 శ్రీ సత్యసాయి జిల్లాలో అక్రమ “ఫిజియోథెరపీ క్లినిక్”పై అధికారుల కఠిన చర్యలు
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్‌లో నడుస్తున్న ఒక “ఫిజియోథెరపీ క్లినిక్”పై
ఆరోగ్య శాఖ అధికారులు షాక్ నోటీసు జారీ చేసి కఠిన చర్యలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ APMCE చట్టం, 2007 నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ, నమోదు లేకుండా మరియు అవసరమైన అర్హతలు లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తికి “కారణం చూపండి నోటీసు (Show ) జారీ చేసిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ (DMHO) కార్యాలయం, క్లినిక్‌ను ఎందుకు సీజ్ చేయకూడదో మరియు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో నిర్దిష్ట గడువులో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అధికారులు స్పష్టం చేసినదేమిటంటే —
గడువులోగా సరైన వివరణ ఇవ్వకపోతే, క్లినిక్‌ను సీజ్ చేయడంతో పాటు అక్కడ జరుగుతున్న వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు APMCE చట్ట అమలు మరింత కట్టుదిట్టం చేయబడుతోందని, జిల్లాలో అక్రమంగా నడుస్తున్న వైద్య సేవలపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు