logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

SWARABRUNDAVANAM SOLO SPECIAL EVENT ON 12.04.2026

15.8.2024 న శ్రీ బృందావనం రవికాంత్ వ్యవస్థాపకులు గా, శ్రీ తూములూరి శ్రీకుమార్ సహ నిర్వాహకులు గా "స్వర బృందావనం" సినీ సంగీత విభావరి రూపు దిద్దుకొన్నది. అప్పటినుంచి ఇప్పటివరకు 35 సంగీత విభావరులు నిర్వహింపబడి "మ్యాజిక్ బ్యానర్" అని పేరు గాంచినది. ప్రతి కార్యక్రమానికి వ్యవస్థాపకునిగా, వ్యాఖ్యాత గా, గాయకునిగా శ్రీ రవికాంత్ ఎనలేని కృషి అభినందనీయం, అనిర్వచనీయం.
గాయనీ గాయకులకు, సాంకేతిక సహాయకులకు అతిథి సత్కారము చేయుటలోను, ప్రతి కార్యక్రమానికి టీజర్ మరియు బ్యానర్ తయారు చేయుటలోను, గాయనీ గాయకులనే విశిష్ట అతిథులుగా భావించి గౌరవించుటలోను, మిక్కిలి శ్రద్ధ వహించి ప్రతి కార్యక్రమం ఇదే మొదటి కార్యక్రమం అన్నట్లు తీర్చి దిద్దుట లోను శ్రీ రవికాంత్ అవిశ్రాంత అవిరళ కృషి బహుధా ప్రశంసనీయం. అందుచేతనే "స్వర బృందావనం" ప్రేక్షక మహాశయుల ప్రశంసల నందుకొన్నది.
హైదరాబాదు నుంచే కాక భువనేశ్వర్, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, గుర్గావ్ మొదలైన సుదూర ప్రాంతాల నుండి గాయనీ గాయకులు ఈ "స్వర బృందావనం" లో పాడుటకు ఉత్సాహంగా రావడమే కాకుండ, వారి వారి ప్రాంతాల లో సంగీత విభావరులను నిర్వహించమని, తమ తమ సహాయ సహకారాలను అందిస్తామని "స్వర బృందావనం" నిర్వాహకుల ను ఆహ్వానించారు.
మెగా ఈవెంట్స్, సోలో సాంగ్స్, పురుష యుగళాలు, సందేశాత్మకాలు (పర్యావరణ పరిరక్షణ) మొదలైన వైవిధ్య కార్యక్రమాలతో "స్వర బృందావనం" దూసుకొని పోతోంది.
ఈ కార్యక్రమాలపై, నిర్వాహకుల పై, "ఐమా మీడియా" లో కూడ ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అలాగే ప్రతి కార్యక్రమానికి ప్రేక్షక మహాశయుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

4
58 views

Comment