ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొని మహాత్మ జ్యోతిరావు పూలే మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమ సమాజాన్నీ స్థాపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని , సమాజంలో ప్రతి వ్యక్తికి విద్య అవసరమని అన్నారు. తన కుటుంబం నుండి సావిత్రిబాయి పూలేను అణగారిన వర్గాల ప్రజల కోసం ముఖ్యంగా మహిళల విద్య కోసం సమాజంలోకి పంపించడం జరిగిందన్నారు. విద్య వల్లనే ప్రస్తుతం విప్లవాత్మక మార్పులు వచ్చాయని వక్తలు మహాత్మా జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు.. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు