logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి బాన్సువాడ రిపోర్టర్ Amair



ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల ముగింపు సందర్భంగా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు

పాల్గొన్న కామారెడ్డి జిల్లా DCHS, ఆసుపత్రి సూపరిండెంట్ డా. విజయ భాస్కర్ గారు, డిప్యూటీ DMHO డా. శ్రీమతి విద్యా గారు, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది.

మొదటగా ఆసుపత్రిలో మహాత్మ జ్యోతి రావు పూలే గారి జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి మహాత్మ జ్యోతి రావు పూలే గారి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన పోచారం గారు

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈనెల 7వ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ దామోదర్ రాజనర్సింహ గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ ఏరియాలో అత్యధికంగా సాధారణ డెలివరీలు జరిగిన ఆసుపత్రిగా అవార్డు పొందిన ఆసుపత్రి వైద్యులను, వైద్య సిబ్బందిని అభినందించిన పోచారం గారు

14
1088 views

Comment