అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహాయోధుడు మహాత్మ జ్యోతిరావు పూలే.
నర్సీపట్నం: మహిళా విద్య కుల నిర్మూలన మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక పెద్ద బొడ్డేపల్లి బైపాస్ రోడ్డు పెదచెరువు వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అయిన తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో పూణేలో మొదటిగా బాలికల కోసం పాఠశాల నిర్మించాలని అంతే కాకుండా 1873లో సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసారన్నారు.కుల వివక్ష వ్యతిరేకంగా సమ సమాజ కోసం శ్రమించారు అంతేకాకుండా బాల్య వివాహాలను వ్యతిరేకించారన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు గాదె శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాత్మా పూలే బడుగు,బలహీన వర్గాల సమాజం కోసం తన జీవితాన్ని అర్పించడం జరిగిందని అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పూలే అని అన్నారు.విద్య ద్వారానే ఈ వర్గాలు ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుందని కులవివక్షత రహిత సమాజం కోసం పనిచేయడం జరిగిందన్నారు. వారి బాటలో బలహీన వర్గాల ప్రజలు విద్యను అభ్యసించడం ద్వారానే సమాజంలో ఉన్నత గుర్తింపు, రాజ్యాధికారం సాధించడం జరుగుతుందని తెలిపారు ఆ దిశలో అందరూ ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కాళ్ళ సుబ్బారావు,ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు నాయుడు, ఓబిసి జిల్లా కార్యదర్శి బోలెం శివ,వెలగా జగన్నాథ్,నర్సీపట్నం రూరల్ కన్వీనర్ నిద్ర శ్రీనివాసరావు,నాతవరం మండల అధ్యక్షుడు సబ్బి కుమారస్వామి,అడిగర్ల రాంబాబు,కురచా కామేశ్వరరావు, ఆంజనేయమూర్తి తదితరులు పాల్గొన్నారు...