మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే దాడులా? ఖండించిన హ్యూమన్ రైట్స్ చైర్మన్ రత్నమయ్య.
AIMA న్యూస్. నంద్యాల జిల్లా.కోర్టు వివాదంలో ఉన్న స్థలం విషయంలో జోక్యం చేసుకొని, మహిళా కానిస్టేబుళ్లు లేకుండా మహిళలపై విచక్షణారహితంగా దాడి చేయడం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనమని, ఇది అత్యంత హేయమైన చర్య అని నంద్యాల జిల్లా హ్యూమన్ రైట్స్ చైర్మన్ డాలు రత్నమయ్య తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శనివారం రోజు ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రత్నమయ్య మాట్లాడుతూ ఆళ్లగడ్డ తాలూకా రుద్రవరం మండలం అప్పనపల్లి గ్రామం.సిరివెళ్ల మండల పరిధిలోని సర్కిల్లో కూటమి పార్టీలోని జనసేన నాయకులకు, సంబంధించిన ఒక స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ స్థలం విషయంలో సిరివెళ్ల సర్కిల్ సీఐ మరియు పోలీసు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. కనీస నిబంధనలు పాటించకుండా, మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అక్కడున్న మహిళలపై లాఠీచార్జ్ చేయడం, వారిని గాయపరచడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని రత్నమయ్య పేర్కొన్నారు.
ఈ అమానుష ఘటనపై జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉపముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా పోరాడుతామని స్పష్టం చేశారు.చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని అతిక్రమించి మహిళలపై దాడులు చేయడం సరికాదని మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.