Telangana:ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్.. డీఏ పెంపు.
తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కరువు భత్యాన్ని 2.1శాతాన్ని పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకుంది.
ఈ పెంచిన డీఏను జనవర్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా వీటిని ప్రభుత్వం చెల్లించనుంది. అయితే పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీ పై ప్రతి నెల రూ. 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. అయితే చివరగా జూలై 2025 లో ప్రభుత్వం 2.1శాతం DA పెంచించింది. అప్పుడు 48.6 శాతంగా ఉన్న డీఎను 50.7శాతానికి ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం పెరిగిన 2.1 శాతం డీఏతో ఇది 52.8కి చేరింది. అయితే మే 2024 లో RPS – 2017 అమలు తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు లేవు.
డీఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. డీఏ ప్రకటించడం పట్ల అటు ఉద్యోగులు సైతం మంత్రితోపాటు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్టీసీలో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్‌లో ఆర్ ఎంలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏ ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వస్తుందని తెలిపారు. జనవరి నుండి ఇవ్వాల్సిన పెండింగ్ డీఏ లు భవిష్యత్ లో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మొదటి నుండి ఆర్టిసీ సంస్థ పరిరక్షణ ,ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పని చేస్తుందన్నారు.