logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తల్లపల్లి అలియాస్ శాగా జ్యోతి (రఘునాథపల్లి) మొదటి భర్త మరణం తర్వాత రెండో వివాహం

జర్నలిస్టు: మాకోటి మహేష్
తల్లపల్లి అలియాస్ శాగా జ్యోతి (రఘునాథపల్లి) మొదటి భర్త మరణం తర్వాత రెండో వివాహం చేసుకుంది. మగపిల్ల కావాలనే ఉద్దేశంతో ఎంసిహెచ్ ఆసుపత్రిలో బేబీ బాయ్‌ను ఎత్తుకెళ్లింది. అయితే బిడ్డ కుటుంబ సభ్యులు ఆమెను పట్టుకుని, బిడ్డను సురక్షితంగా చంపక్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు.
100 డయల్ సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం జనగాం డీసీపీ రాజమహేందర్ నాయక్ గారు, ఏసీపీ పందిరె చేతన్ నితిన్ గారు, సీఐ సత్యనారాయణ రెడ్డి గారు, ఎస్ఐ భరత్ గారు ఎంసిహెచ్ ఆసుపత్రిని సందర్శించి విచారణ నిర్వహించారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.

4
115 views

Comment