logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆడ శిశువును పోషించలేక లక్ష రూపాయలకు అమ్మిన పేరెంట్స్ నలుగురు ఆడపిల్లలు కావడంతో, పోషించలేని తల్లిదండ్రులు 18 రోజుల ఆడ శిశువును 1 లక్షకు అమ్మారు. BANSWADA విలేకర్ Amair

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం, సోమేశ్వర్

గ్రామంలో ఈ రోజు అమానుష ఘటన జరిగింది. నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామనికి చెందిన కిస్టవ్య 18 రోజుల ఆడ శిశువును బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన అనురాధకు లక్ష రూపాయలకు అమ్మింది. కిస్టవ్యకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు, 4 వ సంతానం కూడా అమ్మాయి పుట్టింది. ఇక భర్త శివయ్య కూలిపనులు చేసి కుటుంబాన్ని పోషిస్తాడు. కాగా వారు ఆడ పిల్లలను పోషించలేక 4 వ పాపను అమ్మినట్లు తల్లి కిస్టవ్య తెలిపింది. ఈ సంఘటనపై ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు.

6
224 views

Comment