logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గాజువాక పోలీస్ క్రైమ్ ఇద్దరు నిందితులు అదుపులో తెలుసుకున్న వైనం.. ఎస్ ఐ సిహెచ్ హరికృష్ణ

విశాఖపట్నం (గాజువాక)



విశాఖపట్నం సిటీ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనాల కేసులను గాజువాక క్రైమ్ పోలీసులు ఛేదించి,ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి,వారి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.గాజువాక క్రైమ్ ఎస్ఐ సిహెచ్ హరికృష్ణ తన సిబ్బందితో కలిసి విశ్వసనీయ సమాచారంతో చర్యలు చేపట్టడం ఎస్ఐ హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ గాజువాక 9వ తారీకు మధ్యాహ్నం 2 గం|| మసీద్ జంక్షన్ దగ్గరలో గల బంగారు షాప్ వద్ద అనుమానితులను చేతి సంచిలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించగా వారిద్దరినీ అదుపులో తీసుకుని వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో భాగంగా తమ పేర్లు గండిబోయిన ఉదయ కిరణ్ (Al) మరియు తురక దుర్గారావు (A2) అని వెల్లడించారు.వారి వద్ద ఉన్న సంచులను తనిఖీ చేయగా బంగారం మరియు వెండి ఆభరణాలు లభించాయి. వాటి గురించి ప్రశ్నించగా,గాజువాక ప్రాంతంలో పలు ఇళ్లలో తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు.గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ 30.126/2026, 127/2026 2 137/2026 U/s 331(4), 305(a) BNS వారు చెప్పిన వివరాల ప్రకారం మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి Cr. No:126/2026 కేసులో పేరాపు రమేష్ S/o వెంకట రమణ,వయస్సు 29 సంవత్సరాలు,తుపు కాపు,నివాసం D.No.32-1-17,నాతయ్యపాలెం,గాజువాక ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నాతయ్యపాలెం ప్రాంతంలో తాళం వేసిన ఇంటిలో చొరబడి సుమారు 15 గ్రా|| బంగారం మరియు 13 తులాల వెండి వస్తువులు అపహరించారు. మొత్తం విలువ సుమారు రూ.36,250/-, Cr.No: 127/2026 ఎల్లేటి లక్ష్మి W/o నర్సింగా రావు,వయస్సు 71 సంవత్సరాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం శ్రీనగర్ ఆఫిషియల్ కాలనీ ప్రాంతంలో తాళం వేసిన ఇంటిలోకి ప్రవేశించి సుమారు 9% తులాల వెండి వస్తువులు.5.6,000/-. Cr.No:137/2026 S/% సత్యం నాయుడు,వయస్సు 38 సంవత్సరాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఎల్.వి.నగర్, చినగంట్యాడ ప్రాంతంలో ఇంటి తాళాలు మరియు బీరువా పగులగొట్టి సుమారు 20 తులాల వెండి వస్తువులు అపహరించారు.మొత్తం విలువ సుమారు రూ.8,000/- పోలీసులు నిందితుల వద్ద నుండి సుమారు 14 తులాల బంగారు ఆభరణాలు (చైన్,ఉంగరం) మరియు 45 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దొంగిలించిన సొత్తును అమ్మేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుబడ్డారు. A1 పై 12 కేసులు, A2 పై 4 కేసులు ఉన్నట్లు గుర్తించారు.నిందితులను అరెస్ట్ చేసి. విచారణ కొనసాగుతోంది.

DCP క్రైమ్ శ్రీమతి K. లతా మాధురి (ఐపీఎస్) ఆదేశాల మేరకు,సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ K. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజువాక క్రైమ్ ఎస్ఐ CH. హరికృష్ణ మరియు వారి సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి,తక్షణ చర్యలతో నిందితులను పట్టుకున్నారు.

పోలీస్ వారికి ప్రజలకి విజ్ఞప్తి ఏమనగా

ప్రజలు తమ ఇళ్లను సురక్షితంగా ఉంచుకోవాలని,బలమైన తాళాలు వినియోగించాలని,అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

10
116 views

Comment