logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

కామారెడ్డి ప్రతినిధి
తేదీ:08-04-2026

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పోలీసు స్టేషన్ పరిధిలో గల జాతీయ రహదారి 44 వద్ద మర్కల్ చౌరస్తాలో భార్య భర్తలు (TS17E5376)నెంబర్ గల ద్విచక్ర వాహనం పైన వెళ్తుండగా లారీ (RJ02GC8817) నెంబర్ గల వాహనం వెనుక నుండి ఢీకొట్టడం జరిగింది అని స్థానికులు తెలిపారు అలాగే స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గాయపడిన మహిళా మోడేగాం గ్రామానికి చెందిన రాజమణిగా గుర్తించాం అని తెలిపారు,డికొట్టిన లారీ వాహనం పరారీలో ఉన్నట్లు సదాశివనగర్ పోలీసు అధికారులు తెలియచేశారు. తీవ్రంగా గాయపడిన మహిళను కామారెడ్డి కేంద్రంలోని అపెక్స్ ఆసుపత్రి కి తీసుకురాగా ప్రథమ చికిత్స చేసి అనంతరం గాయం తీవ్రంగా ఉండటంతో మహిళను హైదరాబాద్ కి తీసుకెళ్లడం జరిగింది అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. డికొట్టిన *(RJ 02 GC 8817)* నెంబర్ గల వాహనం ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

19
1071 views

Comment