నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన సుజాతనగర్ పోలీస్..
చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు ఎస్సై రమాదేవి
సుజాతనగర్ ఏప్రిల్ 8 () భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో బుధవారం సాయంత్రం 3.35 గంటల సమయంలో సుజాతనగర్ ఎస్సై రమాదేవి తన సిబ్బందితో కొత్తగూడెం కు చెందిన షేక్ సమద్ యాకుబ్ పాషా సుజాతనగర్ మండలం డేగలమడుగు గ్రామానికి చెందిన కదురుబోయిన నరసింహరావు అను ఇద్దరు వ్యక్తులు నిషిదిత గంజాయితో వేపలగడ్డ లో ధన్వoతరి కాలేజ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పట్టుకొని వారి వద్ద నుండి రూ 7580/ విలువ గల 151.6 గ్రాముల గంజాయిని, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేసి నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కొత్తగూడెం కోర్టులో హాజరు పరిచారు.పట్టుబడిన నిందితుల వివరాలు:
1) షేక్ సమద్ యాకుబ్ పాషా , డ్రైవర్స్ కాలనీ, చాతకొండ, కొత్తగూడెం 2) కుదురుబోయిన నరసింహారావు తండ్రి నాగరాజు, డేగల మడుగు గ్రామం సుజాతనగర్ మండలం.పరారీలో ఉన్న నిందితుని వివరాలు:1.కిరణ్ @దొంగ కిరణ్ నివాసం శేషగిరి నగర్,కొత్తగూడెం కాబట్టి గంజాయి కొనడం అమ్మడం సేవించడం రవాణా చేయడం కలిగి ఉండడం చట్టరీత్యా నేరం. గంజాయి కి సంబంధించి సమాచారం తెలిసిన యెడల పోలీస్ వారికి తెలియజేయగలరు. అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోబడును అని ఎస్ ఐ సుజాతనగర్ వారు తెలియచేసినరు.