పీఎస్ఆర్ గ్రూప్ అధినేత పెంటకోట శంకర్రావు ఆధ్వర్యంలో మంచినీటి వితరణ కార్యక్రమం
విశాఖపట్నం(గాజువాక)
శ్రీశ్రీశ్రీ పెంటమాంబ అమ్మవారి వార్షిక మహోత్సవాల సందర్భంగా పిఎస్సార్ గ్రూప్ అధినేత పెంటకోట శంకర్రావు ఆధ్వర్యంలో పి ఎస్ ఆర్ ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచినీటి సరఫరా కార్యక్రమం చాలా చక్కగా జరిగింది.భక్తులందరికీ దాహార్తి తీర్చుతూ ప్రజలందరికీ ఇటువంటి అసౌకర్యం కూడా కలగకుండా కమిటీ పెద్దలు ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనం చాలా చక్కగా కల్పించారు.ఈ మంచినీటి సరఫరా కార్యక్రమంలో పెంటమాంబ అమ్మవారి కమిటీ పెద్దలు నిర్మాణ కమిటీ పెద్దలు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా పిఎస్ఆర్ ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ప్రముఖ న్యాయవాది పెంటకోట శంకర్రావు మాట్లాడుతూ పిఎస్సార్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో స్వచ్ఛంద సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టామని భవిష్యత్తు కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెంటమాంబ గుడి గ్రామ పెద్దలు కమిటీ పెద్దలు దొడ్డి పెద్దలు మరియు నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.