logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద ప్రజలకు బాసటగా*


*144 మంది లబ్ధిదారులకు 35 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*

పేదలకు వైద్య పరంగా సేవలు అందించడమే తన ధ్యేయమని *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* అన్నారు.బుధవారం ఎస్. ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో *నియోజకవర్గం లోని 144 మంది లబ్ధిదారులకు 35 లక్షల 50 వేల రూపాయల* చెక్కులను పంపిణి చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.తాను ఎమ్మెల్యే గా ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు 4వేల మంది కి పైగా లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయ నిధి కింద సహాయం చేయడం జరిగిందన్నారు.అదే విధంగా నిమ్స్ ఆసుపత్రి లో వైద్య సేవల కోసం 400 మందికి ఎల్. వో. సి లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలను ఆదుకోవడానికి తన నివాసం లో ప్రత్యేకంగా సీఎం సహాయ నిధి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిం ద న్నారు. విద్యా వైద్యం సాగునీరు అందించడం ధ్యేయంగా తాను ముందుకు సాగుతున్నానని అందులో భాగంగానే ముఖ్య మంత్రి కి విన్నవించడం తో నియోజకవర్గానికి 200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించుకోబోతున్నామన్నారు. బాసర లో అమ్మ వారి ఆలయానికి 225 కోట్లు రావడం ముఖ్య మంత్రి శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, నియోజకవర్గం లో ఆసుపత్రుల అభివృద్ధి, 28 ప్యాకేజీ కి నిధులు తెప్పించేందుకు కృషి చేస్తానని ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే తానూర్ కుభీర్ మండలాలు సస్యశామలంగా మారుతాయన్నారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి తో పాటు. పలువురు సీనియర్ నాయకులు, బిజెపి నాయకులు ఆయా గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.

3
25 views

Comment