చిత్తూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ సమావేశం
అక్రిడేషన్ల విషయంలో అన్యాయం జరిగిందని జర్నలిస్టుల ఆగ్రహం
చిత్తూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ సమావేశం
అక్రిడేషన్ల విషయంలో అన్యాయం జరిగిందని జర్నలిస్టుల ఆగ్రహం
చిత్తూరు, బుధవారం:
చిత్తూరు నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీ సమావేశం బుధవారం ఫెడరేషన్ కార్యాలయంలో కేశవులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
డిపిఆర్ఓ కార్యాలయం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్‌కు చెందిన జర్నలిస్టులకు అక్రిడేషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై న్యాయం జరిగే వరకు డిపిఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా ఈ విషయాన్ని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి మరియు సమాచార కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో తీర్మానించారు.
జర్నలిస్టుల హక్కులను పరిరక్షించేందుకు అవసరమైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు. అక్రిడేషన్ల మంజూరులో పారదర్శకత పాటించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు మరియు స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.