logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆదిలాబాద్‌లో ఘనంగా 'ఫుడ్ సేఫ్టీ వాకథాన్': ప్రారంభించిన అదనపు కలెక్టర్ రాజేశ్వర్*

పత్రికా ప్రకటన
ఏప్రిల్ 8, 2026_ఆదిలాబాదు:

*

ప్రతి ఒక్కరూ నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్య వంతులు అవుతారని
అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించిన వాకథాన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించగలరని సూచించారు. ప్రస్తుత తరుణంలో తీసుకునే ఆహారంలో రసాయనాల వాడకల ఎక్కువైందని, వాడకల వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వలన రోజంతా ఉత్సహంగా ఉంటారని సూచించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆహారం, నిద్ర సరైన సమయానికి తీసుకోవాలన్నారు. సరైన ఆహారం తీసుకుందాం - ఆరోగ్యంగా ఉందాం" అనే నినాదంతో ప్రజలు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం పలువురికి ఫుడ్ లైసెన్స్ లను అదనపు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార భద్రత అధికారి ప్రత్యూష, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ నాయక్, వైద్యులు దీపక్ పుష్కర్, నరేందర్, ఇతర అధికారులు, అంగన్వాడీలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment